Nivas News - తెలంగాణ / Nivas news : జోనబోయిన పాపయ్య కుటుంబాన్ని పరామర్శించిన మేకల మల్లి బాబు యాదవ్ .................................... జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ నాయకులు చిమ్మపూడి గ్రామానికి చెందిన జోనబిన పాపయ్య యాదవ్ కుమారుడు వెంకటేష్ ఇటీవల అకాల మరణం చెందాడు.వారి కుటుంబాన్ని అఖిలభారత జిల్లా యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పరామర్శించి, మృతుడు వెంకటేశు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చేతికి అంది వచ్చిన కొడుకు 25 సంవత్సరాల వయసులో కుమారుడు చనిపోవడం ఏ తల్లిదండ్రుల కైనా చాలా బాధాకరంగా ఉంటుందని, ఇది చాలా దురదృష్టకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు . కుమారుని ఆత్మకు శాంతి చేకూరాలని, పాపయ్య కు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు బట్టు కోటేశ్వరరావు, జోన బోయిన అచ్చయ్య ఎర్ర దామోదర్ రెడ్డి, జాన బోయిన నవీన్,బట్ట లాలయ్య, జోన బోయిన సందీప్, పల్లపాటి అచ్చయ్య, శెట్టి నరేష్, తెల్లబోయిన ఉపేందర్, సత్తి రాజు, షేక్ జానీ మియా, జోన బోయిన వెంకటమ్మ, మంగమ్మ, అల్లం ఉష, గణపారపు పార్వతి, ఎనిశెట్టి లలిత, ఎనిశెట్టి నాగమణి, షేక్ జాన్ బి, బంధువులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
Nivas News