Nivas News - తెలంగాణ / హైదరాబాద్ : *జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీ అభ్యర్థి మృతి?* హైదరాబాద్ నివాస్ న్యూస్ నవంబర్ 14 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) నిన్న రాత్రి గుండె పోటుతో మరణించారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే ఈయన అక్టోబర్ 22న నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్‌ను యాక్సెప్ట్ చేయగా పోటీలో నిలిచారు. ఫలితాలకు ఒక్కరోజు ముందు మహమ్మద్ అన్వర్ మరణించడంతో ఆయన అనుచరులు విషాదంలో మునిగి పోయారు. ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
Admin
Nivas News