Nivas News - తెలంగాణ / Nivas news : గిరిజన ఆశ్రమ (వసతి గృహం) పాఠశాలను ఆకస్మిక తనిఖీ- జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గూగులోత్ దేశీ రామ్ నాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఉన్న గిరిజన ఆశ్రమ (వసతి గృహం) పాఠశాల (బాలికలు)ను జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గూగులోత్ దేశీ రామ్ నాయక్, ఆకస్మికంగా తనిఖీ చేశారు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని విద్యాసంస్థల పరిశీలన చేయాలని ఆదేశించన నేపథ్యంలో వారు తనిఖీ చేయడం జరిగింది, వసతి గృహంలోని స్టోర్ గది, కిచెన్ షెడ్ ,డైనింగ్ హాల్, తరగతి గదులు తదితర పరిసరాలను పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు, ప్రేయర్ సమయంలో పిల్లలతో కలిసి పాల్గొన్నారు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పిల్లలు హాజరు వంద శాతం పక్కాగా ఉండాలని సూచించారు, ప్రస్తుత శీతాకాల నేపథ్యంలో పిల్లలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు, షెడ్యూల్ ప్రకారం పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించారు.ప్రతి సబ్జెక్టులో మెలకువలు నేర్పిస్తూ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం విద్యా బోధనలు అందించుటకు చర్యలు తీసుకోవాలన్నారు.హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ ల పై పిల్లలకు అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా ఉండాలని సూచించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ వేడివేడి ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.
Admin
Nivas News