Thursday, 15 January 2026 07:31:27 AM
# ఈ భోగి మీ జీవితంలో భోగ భాగ్యలను తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు మీ డాక్టర్ ప్రకాష్ జాదవ్ నివాస్ న్యూస్ ఛానల్ చైర్మన్ # ఘంటారావం పత్రికకు ఏఐజెపిఎఫ్ సంఘీభావం ప్రకటన # *హైదరాబాద్‌లో మరో దారుణ హత్య* # *నేడు CBI ముందుకు TVK చీఫ్ విజయ్...* # *మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత...* # తల్లి దీవెనలతో ధర్మపోరాటానికి సంసిద్ధం # *ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్త నిధుల అన్వేషణ...* # *వైభవంగా జరిగిన కూడారై ఉత్సవం* # *ప్రమీల అనే వివాహిత మహిళను కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన గటన ఖమ్మనం నగరంలోని బ్రాహ్మణ బజార్‌ లో వెలుగు చూసింది.* # *ఇంటి జాగా లేని వారందరికీ ఇళ్ల స్థలాలు అందించే బాధ్యత నాది....* # శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు # *ఎస్ఆర్ డీ.జీ. స్కూల్లో సంక్రాంతి సంబరాలు* # శ్రీ చైతన్య పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు # *యువత చూపు బీజేపీ వైపు : జ్వాలా నర్సింహారావు...* # *చిన్నపిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్...* # *ఆల్ ఇండియా బంజారా సేవాసంఘ్ (AIBSS )రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రంజిత్ నాయక్...* # * *తీవ్ర వాయుగుండం ముప్పుపెరగనున్న చలి తీవ్రత* # * *ప్రాణాలూ పోతున్నా బిజినెస్సే* *రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత* # * *భూభారతి లో ‘ఎడిట్'తో నిలువు దోపిడీ..!* # * *పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు యూట్యూబర్‌ అరెస్టు*

* *40 నుండి 80 ఏళ్ల మధ్య మనిషిలో జరిగే 10 ముఖ్యమైన మార్పులు*

Date : 08 January 2026 04:15 PM Views : 59

Nivas News - తెలంగాణ / హైదరాబాద్ : *40 నుండి 80 ఏళ్ల మధ్య మనిషిలో జరిగే 10 ముఖ్యమైన మార్పులు* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 8 *కళ్లలో మార్పులు*:- 40 ఏళ్లు దాటిన వెంటనే దగ్గరలోని అక్షరాలు మసక బారటం మొదలవుతుంది. దీనినే ప్రెస్బయోపియా అంటారు. కళ్ల లోని లెన్స్ గట్టి పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. 50 తర్వాత క్యాటరాక్ట్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కంటి పొడిబారుదల, నీరు కారడం, వెలుతురు చూసినప్పుడు ఇబ్బంది కావడం కూడా కనిపిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి రెటీనా ప్రభావితం అయ్యే ప్రమాదం ఎక్కువ. సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష తప్పకుండా చేయాలి. గ్రీన్ లీఫ్ వెజిటల్స్, క్యారెట్, బీట్రూట్, ఒమేగా - 3 ఉన్న ఆహారం కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. *వినికిడి తగ్గడం*:- వయసు పెరుగుతున్న కొద్దీ చెవి లోని సున్నితమైన నర్వులు బలహీనపడతాయి. అందుకే హై - ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ముందుగా వినిపించవు. TV, మొబైల్ వాల్యూమ్ పెంచుకోవటం మొదటి లక్షణం. కొందరికి చెవిలో శబ్దం వినిపించడం ఉంటుంది. 60 లేదా 70 మధ్య వినికిడి పెద్ద స్థాయిలో తగ్గుతుంది. పెద్దగా శబ్దాలు ఉండే ప్రదేశాలు, లౌడ్ మ్యూజిక్, ఎక్కువ హెడ్ ఫోన్ వాడకం ఈ సమస్యను వేగంగా పెంచుతాయి. ఇయర్ క్లీనింగ్, ఇయర్లీ చెక్ అప్ చాలా అవసరం. *చర్మం మారడం*:- చర్మంలోని కొల్లా జెన్, ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల చర్మం సాగిపోవడం, ముడతలు రావడం సహజం. 40 తర్వాత చర్మం త్వరగా పొడిబడి దురద వస్తుంది. 50 తర్వాత ఫిగ్మెంటేషన్, కాస్త మచ్చలు కూడా కనిపిస్తాయి. సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అందుకే బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ చాలా ముఖ్యం. రోజుకు 3 లేక 4 లీటర్ల నీరు తాగడం, కీర, దోసకాయ, వాటర్ మిలాన్, సిట్రస్ ఫ్రూట్స్ తినడం చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. *ఎముకల బలం తగ్గడం*:- వయసు పెరిగేకొద్దీ ఎముక ల్లోని ఖనిజాలు తగ్గిపోతాయి. 40 తర్వాత ప్రతి సంవత్సరం 1% చొప్పున బోన్ డెన్ సిటీ తగ్గుతుంది. 60 తర్వాత ఇది వేగంగా పడిపోతుంది. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్ తర్వాత కాల్షియమ్ & విటమిన్ - D స్థాయిలు పడిపోవడం వల్ల ఆష్టియో పోరోసిస్ ప్రమాదం ఎక్కువ. ఫలితంగా చిన్నపాటి పడిపోవడం లోనే ఎముకలు విరిగే అవకాశం. రోజుకు సన్ లైట్ ఎక్సపోజర్, మిల్క్, రాగి, సెసామే సీడ్స్, లీఫ్ వెజిటల్స్ తీసుకోవడం అవసరం. *కండరాలు బలహీనపడటం*:- శరీరం లోని కండరాలు వయసుతో తగ్గిపోతాయి. చేతులు, కాళ్లు బలహీనంగా అనిపించడం, వస్తువులు ఎత్తలేకపోవడం మొదటి లక్షణాలు. స్టామినా తగ్గుతుంది. 40 తర్వాత ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతే ఈ సమస్య వేగంగా వస్తుంది. 60 లేక 80 మధ్య ఎక్కువ మందిలో మజిల్ లాస్ స్పష్టంగా ఉంటుంది. చికెన్, పప్పులు, పెసరపప్పు, బాటానీ, పన్సు దినుసులు వంటి ప్రోటీన్ ఫుడ్స్ తో పాటు వాకింగ్, యోగ, లైట్ వెయిట్ ట్రైనింగ్ చాలా ఉపయోగపడతాయి. ----------------------------------------- *శరీర ఉష్ణోగ్రత & మెటబాలిజం తగ్గడం*:- మెటబాలిజం తగ్గిపోవడం వల్ల శరీరం కాలరీస్ నెమ్మదిగా ఖర్చు చేస్తుంది. అదే ఆహారం తిన్నా బరువు పెరగడం మొదలవుతుంది. థైరాయిడ్, హార్ మోన్ చేంజెస్ ప్రభావం చూపుతాయి. రాత్రిళ్లు ఆలస్యంగా తినడం, సడెన్ లైఫ్ స్టైల్ బరువు మరింత పెంచుతాయి. 40 తర్వాత ఫైబర్ డైట్ (సజ్జలు, రాగులు, బ్రౌన్ రైస్), వార్మింగ్ వాటర్, ఎర్లీ డిన్నర్ పాటిస్తే మెటబాలిజం చురుకుగా ఉంటుంది. ----------------------------------------- *గుండె ఆరోగ్యంలో మార్పులు*:- వయసు పెరిగిన కొద్దీ arteries కఠినమవుతాయి. రక్తపోటు పెరగడానికి ఇదే ప్రధాన కారణం. 50 లేక 60 మధ్య BP ఎక్కువగా పెరుగుతుంది. కొలె స్ట్రాల్, triglycerides పెరిగితే హృదయ రోగాల ప్రమాదం ఉంటుంది. రోజువారీ బ్రిస్క్ వాక్, తక్కువ ఉప్పు, తక్కువ నూనె, స్ట్రెస్ తగ్గించడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. గ్రీన్ టీ, బీట్ రూట్, వెల్లుల్లి, బాదం హృదయానికి సహాయకం. ----------------------------------------- *జ్ఞాపకశక్తి తగ్గడం*:- 40 తర్వాత మెమరీ షార్ప్ నెస్ ఆమోదయోగ్యంగా తగ్గుతుంది. పేర్లు వెంటనే గుర్తు రాకపోవడం, ఏదో చేయాలనుకున్నాం కానీ మర్చిపోవడం మొదటి సూచన. 60 లేక 80 మధ్య ప్రాసెసింగ్ స్పీడ్ తగ్గిపోతుంది కానీ లైఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల డెసిషన్ మేకింగ్ మెరుగవుతుంది. B12 తగ్గినవారికి మెమరీ మరింతగా తగ్గుతుంది. రోజూ పుస్తకాలు చదవడం, క్రాస్‌వర్డ్‌లు, కొత్త హాబీలు నేర్చుకోవడం మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. *కీళ్ల నొప్పులు & గట్టి పడటం*:- కీళ్లలోని కార్టీ లేజ్ నెమ్మదిగా, తొందరగా మాడిపోతుంది. అందుకే ఉదయం లేవగానే కీళ్లు గట్టిగా అనిపించడం, నడిచేటప్పుడు మోకాళ్లు నొప్పి రావడం జరుగుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్య త్వరగా వస్తుంది. ఒమేగా - 3 ఫుడ్స్ (ఫ్లాక్స్ సీడ్స్, వాల్ నట్స్), రొజూ స్ట్రెచింగ్, physiotherapy, మోకాళ్ల పై ఒత్తిడి తగ్గించడం చాలా ముఖ్యం. *రోగనిరోధక శక్తి తగ్గడం*:- వయసు పెరిగిన కొద్దీ శరీర రక్షణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. ఫ్లూ, దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లు త్వరగా పట్టేస్తాయి. చర్మం మీద చిన్న గాయాలు కూడా ఆలస్యంగా మానుతాయి. ఇమ్మ్యూనిటి కోసం టర్మరిక్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, విటమిన్-C ఫుడ్స్ (ఆరంజ్, ఆమ్లా, లెమన్), మంచి నిద్ర తప్పనిసరి. *ముగింపు:* 40 నుండి 80 వరకు శరీరంలో జరిగే మార్పులు సహజమే. ఇవి రోగాలు కాదు. మనం ఎలా జీవిస్తామో దాని ప్రతిబింబం. సరైన ఆహారం, నడక, నీళ్లు తాగడం, ఒత్తిడి నియంత్రణ ఉంటే వయసు పెరిగినా కూడా శరీరం బలంగా పనిచేస్తుంది. ఆరోగ్యాన్ని ముందుగా చూసుకుంటే వయస్సు ఒక సంఖ్య మాత్రమే అవుతుంది.

Shobhan

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2026. All right Reserved.



Developed By :