Nivas News - తెలంగాణ / Nivas news : *హైదరాబాద్‌లో మరో దారుణ హత్య* *బోరబండ సమీపంలో యువతి హత్య – పరిచయమే ప్రాణాంతకమైంది* హైదరాబాద్ నగరంలో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరబండ సమీపంలో ఒక యువతిని యువకుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. గతంలో బంజారాహిల్స్ సమీపంలోని ఒక పబ్‌లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల ఆ యువతి ఊర్వశి బార్‌కు షిఫ్ట్ కావడంతో యువకుడిని పట్టించుకోవడం తగ్గిందని భావించిన అతడు తీవ్ర కోపానికి లోనయ్యాడు. మాట్లాడదామని చెప్పి యువతిని పిలిచిన యువకుడు, అక్కడే ఆమెపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Nivas News