Nivas News - తెలంగాణ / Nivas news : ఆల్ ఇండియా బంజారా సేవాసంఘ్ (AIBSS )రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రంజిత్ నాయక్. ఆల్ ఇండియా బంజారా సేవాసంగ్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాములు నాయక్ గారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రంజిత్ నాయక్ గారిని ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా నియామక పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో AIBSS రాష్ట్రనాయకులు రాందాస్ నాయక్ గారు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు దారావత్ రామ్మూర్తి నాయక్ గారు, ST సెల్ నాయకులు బానోత్ రాజు నాయక్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు బాబూనాయక్ గారు, పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ పంతులు నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రంజిత్ నాయక్ గారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఎన్నుకున్నందుకు ఎల్లపుడు అందుబాటులో ఉండి జాతి బిడ్డల శ్రేయస్సు కోసం పాటు పడుతూ సంఘం అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు.
Admin
Nivas News