Nivas News - తెలంగాణ / సంగారెడ్డి జిల్లా : ఇంటి జాగా లేని వారందరికీ ఇళ్ల స్థలాలు అందించే బాధ్యత నాది. సంగారెడ్డి, జనవరి 10, నివాస్ న్యూస్: సదాశివపేటలో శనివారం టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సిద్ధాపూర్ లో ఇండ్ల స్థలాల పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ 2013 లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సదాశివపేట పట్టణంలో ఇళ్ల స్థలాలు లేకుండా కిరాయి ఇళ్లలో ఉన్న పేదలకు 182 ఎకరాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. రైతుల నుండి మూడు లక్షలకు ఎకరా చొప్పున కొని భూమి ఇచ్చిన, 222 మంది రైతులకు సైతం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. సదాశివపేట పట్టణ వాసులతో పాటు, సదాశివ పేట మండలంలోని పేదలకు ఇళ్ల స్థలాలు, ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున 5300 మందికి పట్టాలిచ్చామని, 2014 లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, సంగారెడ్డిలో టీఅర్ఎస్ ను గెలిపించారు. రాష్ట్రంలో అధికారంలో లేదు, నేను ఎమ్మెల్యే గా లేను పవర్ లేదు. నేను ఇచ్చిన సమయం లోనే కబ్జాలోకి రండి అని చెప్పిన ఎవరు రాలేదు. టీఅర్ఎస్ హయాంలో ఈ ప్లాట్ల వద్దకు పట్టా దారులు వస్తె పోలీసులతో బెదిరించి వెళ్లగొట్టారు. పవర్ లేకపోవడంతో నేను ఏం చేయలేకపోయాను. నేను రాజకీయాలలో ఉంటా, కానీ ఎమ్మెల్యే గా పోటీ చేయ, నేను ఓట్లు అడగ. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో ఏడాది కింద మాట్లాడా, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో , కలెక్టర్లతో మాట్లాడిన నెల రోజుల కింద కలెక్టర్ తో సమావేశమయ్యాను అని అన్నారు. గతం లో సర్టిఫికెట్ ఉన్న వారికి,ఇంటి స్థలం ఉన్నవారికి ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత మిగతా వారికి ఇస్తామన్నారు. ఇదివరకే స్థలం ఉన్నవారికి స్వయాన నేను రికమెండ్ చేసిన ఇవ్వద్దని కలెక్టర్ కు చెప్పానన్నారు. ఈ స్థలం లో రోడ్లు, కరెంట్ స్థంబాలు ఏపిస్తాను అని, సదాశివపేట పట్టణం లో గతం లో సర్టిఫికెట్ లు ఇచ్చిన వారందరికీ ఇంటి స్థలం వస్తదన్నారు. ఇది జగ్గారెడ్డి మాట, జగ్గారెడ్డి మాట ఇస్తే. అయ్యి తీరుతుంది అన్నారు. మిగిలిన వారికి సదాశివ పేట ఐబి వెనుకాల వెంకటా పూర్ రోడ్ లో భూమి చూడమని అధికారులకు చెప్పిన, అక్కడ కేటాయిస్తా. ఇప్పుడు స్థలాలు ఇస్తా, వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపిస్తా. కులాలు, మతాలకు అతీతంగా ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని, సగటు మనిషి నెలకు లక్ష రపాయలు, నెలకు కోటి రూపాయలు సంపాదించిన సరే రోజుకు 100 రూపాయల తిండి కంటే ఎక్కువ తినలేరు. ఇందిరమ్మ ఇళ్లు కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు 20 వ తేదీ తర్వాత మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోండి అని తెలిపారు. నా పదేళ్ల కోరిక ఇది, పదేళ్ల నుండి ఈ రోజు కోసం ఎదురచూస్తున్న, మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే ఆనందం. అంతకంటే ఎక్కువ ఆనందం నాకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కమిషనర్ శివాజీ, తహసిల్దార్ బాలరాజు, సి డి సి చైర్మన్ గడిల రామ్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు,నాయకులు పట్నం సుభాష్, శంకర్ గౌడ్, గుండు రవి, నాగరాజు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, చోటు, శరత్ చంద్ర, వాజిద్, బిట్ల ప్రేమ్ కుమార్, కొత్త గొల్ల శేఖర్, సజ్జి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Nivas News