Nivas News - తెలంగాణ / Nivas news : మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్పేటలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు ఆమె నివాసానికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. కాగా రోశయ్య 2021లో మరణించారు. ఆయన 2009-10 మధ్య ఏపీ సీఎంగా పనిచేశారు. 2011-16 మధ్య తమిళనాడు గవర్నర్ గా సేవలందించారు.
Admin
Nivas News