Thursday, 15 January 2026 07:31:04 AM
# ఈ భోగి మీ జీవితంలో భోగ భాగ్యలను తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు మీ డాక్టర్ ప్రకాష్ జాదవ్ నివాస్ న్యూస్ ఛానల్ చైర్మన్ # ఘంటారావం పత్రికకు ఏఐజెపిఎఫ్ సంఘీభావం ప్రకటన # *హైదరాబాద్‌లో మరో దారుణ హత్య* # *నేడు CBI ముందుకు TVK చీఫ్ విజయ్...* # *మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత...* # తల్లి దీవెనలతో ధర్మపోరాటానికి సంసిద్ధం # *ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్త నిధుల అన్వేషణ...* # *వైభవంగా జరిగిన కూడారై ఉత్సవం* # *ప్రమీల అనే వివాహిత మహిళను కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన గటన ఖమ్మనం నగరంలోని బ్రాహ్మణ బజార్‌ లో వెలుగు చూసింది.* # *ఇంటి జాగా లేని వారందరికీ ఇళ్ల స్థలాలు అందించే బాధ్యత నాది....* # శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు # *ఎస్ఆర్ డీ.జీ. స్కూల్లో సంక్రాంతి సంబరాలు* # శ్రీ చైతన్య పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు # *యువత చూపు బీజేపీ వైపు : జ్వాలా నర్సింహారావు...* # *చిన్నపిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్...* # *ఆల్ ఇండియా బంజారా సేవాసంఘ్ (AIBSS )రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రంజిత్ నాయక్...* # * *తీవ్ర వాయుగుండం ముప్పుపెరగనున్న చలి తీవ్రత* # * *ప్రాణాలూ పోతున్నా బిజినెస్సే* *రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత* # * *భూభారతి లో ‘ఎడిట్'తో నిలువు దోపిడీ..!* # * *పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు యూట్యూబర్‌ అరెస్టు*

*చిన్నపిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్...*

Date : 10 January 2026 04:59 PM Views : 84

Nivas News - తెలంగాణ / Nivas news : చిన్నపిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్ వరంగల్ నగరంలో చిన్నపిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న నిందితులను కాజిపేట్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలసి అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు: 1) కొడుపాక నరేష్ వయస్సు: 42 సంవత్సరాలు గ్రామం ఘవాపూర్ గ్రామం, పెద్దపల్లి జిల్లా మరియు 2) వెల్పుల యాదగిరి, వయస్సు: 32 సంవత్సరాలు, నివాసం శాంతినగర్, పెద్దపల్లి టౌన్, పెద్దపల్లి జిల్లా కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశం వివరాలు వెల్లడిస్తూ గత డిసెంబర్ నెల 28వ తేదీన తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్ పాత్ పైన నిద్రిస్తున్న కన్నా నాయక్ కుమారుడైన 5 నెలల వయసున్న మల్లన్న అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగటనలో బాలుడి తండ్రి కన్నా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇట్టి కేసు దర్యాప్తులో భాగంగా కాజిపేట్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారించగా నేరాస్తలం లో లభించిన ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ఇద్దరు ఈ రోజు ఉదయం అద్దెకు తీసుకున్న కారులో మళ్ళీ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో అనుమనస్పదంగా కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫూట్ పాత్ వద్ద రెక్కి నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను కాజీపేట పోలీసులు పట్టుకొని విచారించగా వాళ్లు 28 డిసెంబర్, 2025 రోజున కిడ్నాప్ చేసిన ఐదు నెలల బాబు కిడ్నాప్ తో పాటుగా గతంలో నలుగురు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఇట్టి పిల్లలను వీళ్ళు పిల్లలు కలగలేని దంపతులకు అనాధాశ్రమాల నుంచి తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా నమ్మబలికి డబ్బులకు అమ్ముకున్నారు. 28 డిసెంబర్, 2025 రోజున కిడ్నాప్ చేసిన ఐదు నెలల బాబుని జన్నారం మండలం లింగయ్యపల్లీ గ్రామంలో, ఇదే విదంగా గతంలో ఇద్దరు నిందితులు కిడ్నాప్ చేసిన నలుగురు పిల్లల్లో 2025 ఆగస్టు లో వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫాం పైన తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను మంచిర్యాల జిల్లా నస్పూర్ లో, 2023 అక్టోబర్ నెలలో కాజీపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న మూడు సంవత్సరాల బాబును జన్నారం మండలంలో, 2025 అక్టోబర్ నెలలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిదురిస్తున్నటువంటి 05 నెలల పాపను మంచిర్యాలలో మరియు 2025 జూన్ నెలలో రామగుండం రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను జగిత్యాల జిల్లాలో అమ్మినారు. ఇట్టి నేరస్తుల నేర ఒప్పుకోలు ఆధారంగా కాజీపేటలో అపహరణకు గురైన ఐదు నెలల బాబు మల్లన్నతో పాటుగా మిగతా నలుగురు పిల్లల పిల్లలను రెస్క్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేకుండా కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. చిన్నపిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేసారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, టాస్క్ ఫోర్స్, కాజీపేట ఏసీపీ లు మధుసూదన్, ప్రశాంత్ రెడ్డి, కాజీపేట ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది తో పాటు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

Nivas News

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2026. All right Reserved.



Developed By :