Thursday, 15 January 2026 07:31:08 AM
# ఈ భోగి మీ జీవితంలో భోగ భాగ్యలను తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు మీ డాక్టర్ ప్రకాష్ జాదవ్ నివాస్ న్యూస్ ఛానల్ చైర్మన్ # ఘంటారావం పత్రికకు ఏఐజెపిఎఫ్ సంఘీభావం ప్రకటన # *హైదరాబాద్‌లో మరో దారుణ హత్య* # *నేడు CBI ముందుకు TVK చీఫ్ విజయ్...* # *మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత...* # తల్లి దీవెనలతో ధర్మపోరాటానికి సంసిద్ధం # *ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్త నిధుల అన్వేషణ...* # *వైభవంగా జరిగిన కూడారై ఉత్సవం* # *ప్రమీల అనే వివాహిత మహిళను కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన గటన ఖమ్మనం నగరంలోని బ్రాహ్మణ బజార్‌ లో వెలుగు చూసింది.* # *ఇంటి జాగా లేని వారందరికీ ఇళ్ల స్థలాలు అందించే బాధ్యత నాది....* # శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు # *ఎస్ఆర్ డీ.జీ. స్కూల్లో సంక్రాంతి సంబరాలు* # శ్రీ చైతన్య పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు # *యువత చూపు బీజేపీ వైపు : జ్వాలా నర్సింహారావు...* # *చిన్నపిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్...* # *ఆల్ ఇండియా బంజారా సేవాసంఘ్ (AIBSS )రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రంజిత్ నాయక్...* # * *తీవ్ర వాయుగుండం ముప్పుపెరగనున్న చలి తీవ్రత* # * *ప్రాణాలూ పోతున్నా బిజినెస్సే* *రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత* # * *భూభారతి లో ‘ఎడిట్'తో నిలువు దోపిడీ..!* # * *పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు యూట్యూబర్‌ అరెస్టు*

*ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్త నిధుల అన్వేషణ...*

Date : 11 January 2026 01:21 PM Views : 76

Nivas News - తెలంగాణ / Nivas news : *ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్త నిధుల అన్వేషణ...* యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో గుప్తనిధుల కోసం దేవుడి విగ్రహం కింద తవ్వకాలు చేసిన ఘటన కలకలం రేపింది. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో సాగిన ఈ అక్రమ తవ్వకాలను పోలీసులు అడ్డుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల మాదాపూర్ గ్రామ పరిధిలోని కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమికి ఈసీఐఎల్‌కు చెందిన పులి కుమార స్వామిని సూపర్‌వైజర్‌గా నియమించాడు. అయితే నెలసరి వేతనం సరిపోవడం లేదని భావించిన కుమార స్వామి, ఈజీ మనీ కోసం గుప్తనిధులపై కన్నేశాడు. వ్యవసాయ భూమిలో ఉన్న చిన్న గుట్టపై ఆంజనేయ స్వామి విగ్రహం ఉండటంతో, దాని కింద గుప్తనిధులు ఉంటాయని అతడు నమ్మాడు. ఈ ఆలోచనతో విజయవాడకు చెందిన రామినేని కృష్ణా కిషోర్, పాబోలు శ్రీనివాస్, ఆకుల నరసింహ రావు, ఖమ్మంకు చెందిన తాత కృష్ణకాంత్, బొమ్మల రామారంకు చెందిన వేణులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రచారం చేస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహించి హిటాచీ సహాయంతో తవ్వకాలు చేపట్టారు. అయితే గ్రామస్థులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. తవ్వకాలకు ఉపయోగించిన హిటాచీ యంత్రం, కారు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో గుప్తనిధుల తవ్వకాలు చేయడం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. గుప్తనిధుల పేరుతో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Nivas News

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2026. All right Reserved.



Developed By :