Nivas News - తెలంగాణ / ఖమ్మం : శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు : శ్రీ చైతన్య ఖమ్మం ఫోర్ బ్రాంచ్ నందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని, పాఠశాలలో మామిడి తోరణాలతో అలంకరించి ముగ్గులు పోటీలను నిర్వహించి ముగ్గుల పోటీలను నిర్వహించి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. పరమనాన్ని తయారుచేసి భోగి మంటలను నిర్వహించారు. బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. విద్యార్థుల తలపై నుండి భోగిపళ్ళను పోసి విద్యార్థులకు సకల శుభాలు చేకూరాలని దీవించారు. తదనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రవి గారు మాట్లాడుతూ దేవతలు ఉత్తరాయనమూలోకి ప్రవేశించిన సందర్భంగా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సందర్భంగా అన్నీ శుభదినాలు చేకూరుతాయని, శ్రీమహావిష్ణువు రాక్షసులను సంహరించి శుభాలు చేకూర్చిన రోజని, రైతులు పంట చేతికొచ్చి సకల భోగభాగ్యాలతో వేల సిరులతో దానధర్మాలు చేకూర్చాలని, గాలిపటాలు ఆకాశంలో ఎగరవేసి దేవతలకు స్వాగతం పలుకుతారని, హరిదాసులు గంగిరెద్దులతో ఎంతో సంక్రాంతి జరుపుకుంటారని, ప్రజలందరూ ఆనందంతో గడపాలని అందరికీ శుభలు చేకూరాలని వివరించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చైతన్య డైరెక్టర్ శ్రీవిద్య గారు, డీజీఎం చేతన్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవి గారు, పి పి టి కోఆర్డినేటర్ గౌతమి గారు, ప్రైమరీ ఇంచార్జ్ మణి గారు , పి పి టి ఇంచార్జ్ స్వాతి గారు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు
Admin
Nivas News