Nivas News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ నాయకులు.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలనే లక్ష్యంతో 34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు,భట్టు మురళీ నాయక్, భట్టు వీరు,ఉండేటి శాంతి వర్ధన్, పాల్వంచ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బట్టు పవన్ కుమార్,భట్టు లక్ష్మణ్, బట్టు నాగరాజు, వీరమ్మ , చావా లక్ష్మీ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు
Admin
Nivas News