Nivas News - తెలంగాణ / Nivas news : యువత చూపు బీజేపీ వైపు : జ్వాలా నర్సింహారావు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ అధ్యక్షతన నేలకొండపల్లి మండల పార్టీ సమావేశం భైరవునిపల్లి గ్రామం లో మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు గారి నివాసంలో మండల నాయకుల, బూత్ అధ్యక్షుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా మండల ప్రభారీ జ్వాలా నర్సింహారావు, పాలేరు ఇంచార్జ్ నున్నా రవి కుమార్ పాల్గొన్నారు ఈ సందర్బంగా జ్వాలా నర్సింహారావు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం పై ద్రుష్టి పెట్టాలని పిలుపునిచ్చారు, పార్టీ నిర్మాణ పటిష్టానికి ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో కృషి చేసేట్టటు నాయకులు భాద్యత తీసుకోవాలని అన్నారు, కేంద్ర ప్రభుత్వం పధకాలు, మోడీ గారి పాలన పై ప్రజల్లో అవగాహనా పెంచాలని పిలుపునిచ్చారు, ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో పనిచేసిన్నపుడే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలునిచ్చారు, రానున్న రోజుల్లో తెలంగాణా లో డబుల్ ఇంజన్ సర్కార్ రానుందని అన్నారు, మండలలో రానున్న రోజుల్లో మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని దాంట్లో ఎటువంటి సందేహం లేదని అన్నారు, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి పాలనకు యువత పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతున్నారని యువత బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు, ఈ కార్యక్రమం లో బీజేపీ పాలేరు ఇంచార్జ్ నున్నా రవికుమార్, మండల ప్రధానకార్యదర్శి మల్లె బోయిన గోవిందరావు, సీనియర్ నాయకులు భువనసి దుర్గారావు, సూరేపల్లి జ్ఞానరత్నం, కోటి హనుమంతరావు, మండల నాయకులు, గెల్లా చక్రపాణి, సయ్యద్ మోహినుద్దీన్,కాళంగి వెంకటేశ్వర్లు, లింగనబోయిన వెంకటేశ్వర్లు, కందరబోయిన గోపి, దేశబోయిన వేణుబాబు, కొండా హర్షవర్ధన్, గెల్లా నాగసాయి, జెల్లా సురేష్,కొదమగండ్ల స్వామి దాస్, రామారావు, బానోత్ శ్రీనివాసరావు, కట్టా అప్పారావు,జోగుపర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు
Admin
Nivas News